Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

సెన్సార్ చిక్కుల్లో ‘బుర్రకథ’!

Burra Katha Movie Release, సెన్సార్ చిక్కుల్లో ‘బుర్రకథ’!

ఆది సాయికుమార్ హీరోగా రచయిత డైమండ్ రత్నబాబు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కాగా మొదట ఈ సినిమా జూన్ 28న అనగా ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రేపు కూడా రిలీజ్ కావట్లేదని తెలుస్తోంది. త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం చెబుతున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ద‌క్కించుకుని సినిమాను విడుదల చేస్తోంది.

మిస్తీ చక్రబోర్తి , నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

#burrakatha not releasing on June 28 new release date will announce soon 🧠🧠

A post shared by ActorAadi (@aadipudipeddi) on

 

Related Tags