Budget Session 2021 Parliament LIVE : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ… గత పార్లమెంట్ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కరోనా వైరస్ పై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనా నుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
కరోనా వైరస్ విసిరిన సవాళ్లు, సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఉరుముతున్న నిరుద్యోగం తదితర సమస్యల మధ్య పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు విడతలుగా సాగే ఈ భేటీల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శల అస్త్రాలను దీటుగా తిప్పికొట్టేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాలను రచిస్తోంది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభ అయ్యాయి. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు 2021-22 బడ్జెట్‌ను సమర్పిస్తారు.
రాష్ట్రపతి ప్రసంగం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించారు. అదే సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పిన వారిలో ఉప రాస్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితరులున్నారు.
Delhi: President Ram Nath Kovind leaves from the Parliament House after his Address at the joint session of the Parliament concludes. Vice President M Venkaiah Naidu and Prime Minister Narendra Modi also with him.#BudgetSession pic.twitter.com/m7CoX0hLjn
— ANI (@ANI) January 29, 2021
భారతదేశం ఎన్నో సంక్షోభాలను ఐక్యంగా ఎదుర్కొందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా కష్టాలను దేశం సంఘటితంగా అధిగమించిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారతదేశంలో జరుగుతోందని అన్నారు. భారతదేశం రెండు దేశీయ వ్యాక్సిన్లను రూపొందించిందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు ఉండేవి. ఇప్పుడు మనం ప్రపంచంలో నెంబర్ టూ . రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు జరిగింది.
ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం.
సరిహద్దుల్లో శాంతిని భగ్నం చేసే ప్రయత్నాలు చేశాయి. మన సైనికులు అలాంటి ప్రయత్నాలను ధైర్గంగా తిప్పి కొట్టారు. గల్వాన్‌లో ప్రాణాలర్పించిన వారికి దేశం తోడుగా ఉంది.సైన్యాన్ని బలోపేతం చేస్తాం. ఆధునిక ఆయుధ సాయుద సంపత్తిని సమకూర్చుకుంటున్నాం. యుద్ద విమానాల తయారీకి హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్లు ఇచ్చాం.
నక్సలైట్ల సమస్య తగ్గింది. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. కాశ్మీర్‌లో జిల్లా మండల్ల అభివృద్ధి ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారు. జమ్మూలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటవ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. సరిహద్దుల్లో శాంతిని భగ్నం చేసే ప్రయత్నాలు చేశాయి. మన సైనికులు అలాంటి ప్రయత్నాలను ధైర్గంగా తిప్పి కొట్టారు. గల్వాన్‌లో ప్రాణాలర్పించిన వారికి దేశం తోడుగా ఉంది.
గ్యాస్ రవాణా కోసం దేశ వ్యాప్తంగా గ్యాస్ పైప్ లైన్ ద్వారా జోడించేందుకు కృషి చేస్తున్నాం. నగరీకరణను పెంచేందుకు నగరాల్లో సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాం. నగరాల్లో లక్షల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నాం. నగరాల్లో మెట్రో రైల్ లైన్ ల నిర్మాణం వేగంగా సాగుతోంది.
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. దేశంలో కొన్ని రైల్వే లైన్లను సరకు రవాణాకు కేటాయించాం. మౌలిక వసతుల కల్పనకు పది లక్షల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నాం. భారత్ మాల ప్రాజెక్టులో బాగంగా వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కల్పన పెరుగుతోంది.
పన్నుల వ్యవస్తను సరళీకరించాం. కార్మిక చట్టాలను సరళీకరించి నాలుగు చట్టాలుగా మార్చాం. ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్త లేబర్ కోడ్ వల్ల మహిళలకు న్యాయం జరుగుతుంది. ఉత్పత్తి పెరగాలంటే నిధులు అవసరం. వోకల్ ఫర్ లోకల్ అనేది ఉద్యమ రూపం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మెరుగు పడుతోంది. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక కష్టాల నుంచి భారత్ బయటపడుతోంది.
భారతీయ ఉత్పత్తుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు.. రాష్ట్రీయ ఈ విధాన్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నాం. పార్లమెంట్ కోసం కొత్త భవనం నిర్మిస్తున్నాం. కొత్త భవనం వల్ల ఎంపీలకు కొత్త సౌకర్యాలు పెరుగుతాయి.
సబ్‌కా సాత్ సాత్, సబ్‌కా విశ్వాస్ విధానంతో అందర్నీ కలుపుకుపోవడం మా లక్ష్యం. వికలాంగులు, ట్రాన్స్ జెండర్లు, సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది.
దేశంలో డిజిటల్ మనీ చెల్లింపులు పెరిగాయి. ఉమంగ్ యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలను కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం , నేరుగా బ్యాంకు ఖాతాలలో నిధులు వేయడం వల్ల లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అవినీతి తగ్గింది. భారతీయ ఉత్పత్తుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు.. రాష్ట్రీయ ఈ విధాన్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నాం. పార్లమెంట్ కోసం కొత్త భవనం నిర్మిస్తున్నాం. కొత్త భవనం వల్ల ఎంపీలకు కొత్త సౌకర్యాలు పెరుగుతాయి.
గ్రూప్-సి, డి పోస్టులకు ఇంటర్వ్యూలు తొలగించడంతో ప్రతిభకు గుర్తింపు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ప్రజాస్వామ్యం బలోపేతం. దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణమీయంగా పెరిగాయి.
శిశుమరణాలు భారీగా తగ్గాయి. గర్బవతులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మిలటరీ, వాయుసేన, ఇతర రక్షణ రంగాల్లో మహిళలు పని చేస్తున్నారు. మహిళల భద్రత కోసం కొత్త చట్టాలు, పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసాం.
దేశాన్ని స్వయం సంవృద్ధి పథంలో నడపాలంటే చిన్న , మధ్య తరహా పరిశ్రమలు అవసరం. చిన్న, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయల తక్షణ రుణం, ఎంఎస్ ఎంఈల కోసం రుణాలు అందించేదుకు నిధులు అందిస్తున్నాం
దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. గణతంత్ర దినోత్సవం, జాతీయ పతాకానికి కొన్ని రోజులుగా అవమానాలు ఎదురవుతున్నాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైంది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత.
ఆత్మ నిర్భర్ భారత్‌లో మహిళల పాత్ర కీలకం. ముద్రా యోజన కింద మహిళలకు 50వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ఇతర పథకాల కింద మహిళలకు మూడు లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. మహిళల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నాం
మత్స్య సంపద పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. గత ఐదేళ్లలో 20వేల కోట్లు మత్స్య సంపద పెంచేందుకు ఖర్చు చేశాం. చైరకు రైతుల్ని ప్రోత్సహించేందుకు ఇథనాల్ ఉత్పత్తి పెంచుతున్నాం. గ్రామాల అభివృద్ధి కోసం బాపూజీ సిద్ధాంతాల్ని మా ప్రభుత్వం ఫాలో అవుతోంది. 2022 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఇచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ లోన్లు తేలిగ్గా అందించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల వల్ల గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది.
రైతుల కోసం తీసుకొచ్చిన కిసాన్ రైళ్లతో కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కదులుతున్న కోల్డ్ స్టోరేజ్ లాంటిది. రైతుల ఆదాయం పెంచడానికి పశువుల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తోంది. పాల ఉత్పత్తుల్ని పెంచేందుకు 15వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల పట్ల ఎక్కువ దృష్టి పెట్టాం. దేశంలో వీళ్లు 10 కోట్ల మంది ఉన్నారు. మా ప్రభుత్వం వీళ్లకు ప్రాధాన్యం ఇస్తోంది. వీరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింది లక్ష కోట్లకుపైగా ట్రాన్స్ పర్ చేశాం.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ధి భారతం ఒక స్వప్నం అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు అనేక దేశాలకు సరఫరా అవుతున్నాయి. ఈ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అని తెలిపారు.
ఆత్మ నిర్మర్ భారత్ లక్ష్యం.. ఇంకా మనం ఎలా బలోపేతంగా ఎదగగలం అనేది ఇప్పుడు దేశం ముందున్న చర్చ. దేశంలో వ్యవసాయ రంగం మరింత వృద్ధి సాధించాలి. స్వామి నాధన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నాం. రైతుల ఆదాయం ఒకటిన్నర రెట్లు పెరిగింది. రైతులకు మద్దతు ధరకు ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్దతుల్ని రైతులకు వద్దకు తీసుకెళుతున్నాం అని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారు అని రాష్ట్రపతి అన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొంది. భారత్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్ కూడా అడ్డుకోలేదు. కరోనాపై భారతదేశం పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం.. సమయానుకూల చర్యలతో కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగాం. ఈ పార్లమెంట్ సమావేశాలు భారతదేశానికి ఎంతో కీలకందేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. ఏకత్వ భావన.. దేశాన్ని అనేక కష్టాల నుంచి బయటపడేసింది. గతేడాది దేశంలో అనేక సమస్యలు వచ్చాయి. కరోనా, భూకంపాలు, తుపానులు అన్నింటినీ ఏకత్వంతోనే దాటుకుని వచ్చాం. ఆరుగురు ఎంపీలు కరోనాతో చనిపోయారు. భారత్ కొత్త సామర్థ్యంతో ఎదుగుతోంది. కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి. చాలా మంది కోలుకున్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆకలితో ఎవరూ చనిపోకూడదని.. కరోనా కాలంలో బియ్యం సరఫరా చేశాం.