అన్నదాతలకు అండగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు.. రైతులకు రూ.16.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు

|

Feb 01, 2021 | 12:52 PM

వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు.

అన్నదాతలకు అండగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు.. రైతులకు రూ.16.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
Follow us on

Agriculture Budget 2021 :

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. వ్యవసాయ సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆర్థిక మంత్రి.. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరకుగాను 1,72,000వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. 2020-21లో రైతులకు 75వేల కోట్ల రూపాయలు కేటాయించామని.. దీని వల్ల 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. రూ.16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్రామీణ మౌలిక నిధికి కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచామని చెప్పారు.

ఇక గత ఏడాది గోధుమల కనీస మద్దతు ధర కోసం రూ. 75,000 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. దీంతో 43 లక్షల మందికి పైగా గోధుమలు పండించే రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.. రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉందన్నారు. దేశ వ్యాప్తంగా మరో 1,000 మండీలను ఈనామ్‌తో అనుసంధానిస్తమన్నారు. అస్సాం, బెంగాల్‌లో పని చేస్తున్న టీ కార్మికుల కోసం1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also…. Budget in Telugu 2021 LIVE: కేంద్ర బడ్జెట్ హైలైట్స్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్