లాక్‌డౌన్‌ వేళ పెళ్లి చేసుకుని.. లాకప్‌ పాలయ్యారు..

ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు కరోనా బారినపడి మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని.. పెళిళ్లు కూడా పెద్ద సంఖ్యలో బంధువులతో జరపకూడదని.. ఇలా అనేక ఆంక్షలు విధించింది. అయితే గుజరాత్‌ లోని ఓ […]

లాక్‌డౌన్‌ వేళ పెళ్లి చేసుకుని.. లాకప్‌ పాలయ్యారు..
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 9:25 PM

ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు కరోనా బారినపడి మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని.. పెళిళ్లు కూడా పెద్ద సంఖ్యలో బంధువులతో జరపకూడదని.. ఇలా అనేక ఆంక్షలు విధించింది. అయితే గుజరాత్‌ లోని ఓ జంట కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ శుభకార్యానికి మొత్తం 14 మంది హాజరయ్యారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నవసరి పట్టణానికి చెందిన జంట..ఓ దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నారని.. సమాచారం అందడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని.. వధూవరులతో పాటు.. వివాహానికి వచ్చిన వారిని అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ వేళ నిబంధనలను పాటించని.. జంటపైన.. వారి బంధువులపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.