తల్లిపాల ద్వారా పిల్లలకు కరోనా రాదు.. తేల్చిన వైద్యులు

తల్లి పాల ద్వారా పిల్లలకు కరోనా రాదని తేల్చిచెప్పారు గాంధీ వైద్యులు. తల్లిపాల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే అపోహలకు గాంధీ పరిశోధకులు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా టీవీ9తో గాంధీ గైనకాలజీ ప్రొఫెసర్ షర్మిల మాట్లాడుతూ..

తల్లిపాల ద్వారా పిల్లలకు కరోనా రాదు.. తేల్చిన వైద్యులు
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 12:29 PM

తల్లి పాల ద్వారా పిల్లలకు కరోనా రాదని తేల్చిచెప్పారు గాంధీ వైద్యులు. తల్లిపాల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే అపోహలకు గాంధీ పరిశోధకులు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా టీవీ9తో గాంధీ గైనకాలజీ ప్రొఫెసర్ షర్మిల మాట్లాడుతూ.. భౌతిక దూరం లేకపోవడం వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. బ్రెస్ట్ ఫీడ్‌లా కాకుండా తల్లి నుంచి పాలను సేకరించి పిల్లలకు అందించొచ్చు. తల్లికి బిడ్డకి పాలు ఇచ్చే క్రమంలో సహాయకులు తప్పనిసరి. మిల్క్ బ్యాంక్ నుంచి తెచ్చిన పాలు ఇవ్వడానికి తల్లులు ఒప్పుకోవడం లేదు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం.. ఇప్పటివరకూ పౌడర్ పాలు శిశువుకి పట్టేవాళ్లం. తాజాగా పరిశోధన ద్వారా తల్లి పాలను బిడ్డకు ఇవ్వొచ్చు. అయితే నేరుగా పాలు ఇవ్వకూడదు. కాగా కరోనాతో ఉన్న ఇద్దరు గర్భిణీలకి గాంధీలో ఆపరేషన్ చేసి క్షేమంగా బిడ్డని తీసాం. ఇప్పుడు కరోనాతో ఉన్న మరో మహిళకు డెలివరీ చేయాల్సి ఉందన్నారు గాంధీ గైనకాలజీ ప్రొఫెసర్ షర్మిల.

Read More: 

రైతులకు మేలు చేకూరే విధంగా.. ఏపీలో భారీ కార్యక్రమం..

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం