సీఎం జగన్‌కు, ఎంపీ రఘురామ లేఖ.. ఈసారి ఎందుకంటే..

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2020 | 2:10 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ‌త కొంత‌కాలంగా అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు.

సీఎం జగన్‌కు, ఎంపీ రఘురామ లేఖ.. ఈసారి ఎందుకంటే..
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ‌త కొంత‌కాలంగా అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. పాదయాత్ర సమయంలో దీనికి సంబంధించి హామి ఇచ్చిన విష‌యాన్ని సీఎంకు గుర్తు చేశారు ర‌ఘురామ‌. జిల్లాకు అల్లూరి పేరు పెడతామని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తార‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం సీఎంకు రాసిన లేఖను ఎంపీ క్యారాలయం మీడియాకు అంద‌జేసింది. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే లేఖ రాయడం పొలిటీక‌ల్ హీట్ పెంచుతోంది.

రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై, అధినేత‌పై చేసిన వ్యాఖ్యల్ని హైక‌మాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్ర‌మంలో వారంలోగా చేసిన వ్యాఖ్య‌ల‌కు వివ‌రణ‌ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది. కానీ ఆయన మాత్రం ఇక్క‌డ త‌న మార్క్ రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించారు. అస‌లు లెట‌ర్ హెడ్ పై ఉన్న పార్టీకి గుర్తింపు ఉందా అని ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత ఇదే విష‌యంపై ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌..కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని క‌లిశారు. వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసి.అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా కోరారు. దీంతో వివాదం మ‌రింత ముసిరింది.