శ్రీలంకలో ఉగ్రదాడులపై జగన్ దిగ్భ్రాంతి

|

Apr 21, 2019 | 9:19 PM

హైదరాబాద్‌ :శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్ర దాడుల ఘటనలను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి రక్త హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు  పేర్కొన్నారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, […]

శ్రీలంకలో ఉగ్రదాడులపై జగన్ దిగ్భ్రాంతి
Follow us on

హైదరాబాద్‌ :శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్ర దాడుల ఘటనలను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి రక్త హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు  పేర్కొన్నారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కొలంబోలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లలో 185మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్లు పేర్కొంది. కాగా శ్రీ లంక వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది.