లగడపాటితో వంగవీటి రాధా భేటీ

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీని వీడిన రాధాకృష్ణ, టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుచరులు, సన్నిహితులు విస్తృతస్థాయిలో చర్చిస్తోన్న వంగవీటి.. అందులో భాగంగానే లగడపాటిని కలిశారని సమాచారం. తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవమానించేలా జగన్ వ్యవహరించారని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీలో చేరే విషయంపై త్వరలోనే […]

లగడపాటితో వంగవీటి రాధా భేటీ

Edited By:

Updated on: Mar 06, 2019 | 12:32 PM

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీని వీడిన రాధాకృష్ణ, టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుచరులు, సన్నిహితులు విస్తృతస్థాయిలో చర్చిస్తోన్న వంగవీటి.. అందులో భాగంగానే లగడపాటిని కలిశారని సమాచారం. తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవమానించేలా జగన్ వ్యవహరించారని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీలో చేరే విషయంపై త్వరలోనే రాధాకృష్ణ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.