Good news: తెలుగు రాష్ట్రాలు సేఫ్.. దాని ప్రభావం లేదు

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం లేదని అధికారులు ప్రకటించారు. దాంతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అసలే కరోనా ఇక దాని ప్రభావం కూడా వుంటే పరిస్థితి ఏంటని మధన పడిన తెలుగు ప్రజలు ఇపుడు హర్షం వెలిబుచ్చుతున్నారు.

Good news: తెలుగు రాష్ట్రాలు సేఫ్.. దాని ప్రభావం లేదు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 2:24 PM

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం లేదని అధికారులు ప్రకటించారు. దాంతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అసలే కరోనా ఇక దాని ప్రభావం కూడా వుంటే పరిస్థితి ఏంటని మధన పడిన తెలుగు ప్రజలు ఇపుడు హర్షం వెలిబుచ్చుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాలుస్తున్న నిసర్గ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో ఉధృతమైన నిసర్గ ప్రభావం మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలపై మాత్రమే వుందని మెట్ అధికారులు వెల్లడించారు.

నిసర్గ ప్రస్తుతం ముంబై నగరానికి దక్షిణ నైరుతి దిశగా 450 కిలో మీటర్ల దూరంలోను, గోవాకు పశ్చిమ దిశగా 280 కిలో మీటర్ల దూరంలోను, సూరత్ తీరానికి దక్షిణ నైరుతి దిశగా 670 కిలో మీటర్ల దూరంలోను కేంద్రీకృతమై తీవ్ర వాయు గుండంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆరు గంటల్లో తుఫానుగా మారే అవకాశం వుందని, 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని అధికారుల అంఛనా వేస్తున్నారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం మహారాష్ట్రలో అలీబాగ్ ప్రాంతంలో తీరం దాటే అవకాశం వుందని చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో అలీబాగ్ తీరప్రాంతంలో గంటలకు 110 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.

Latest Articles