మూల విరాట్టును తాకిన భాను కిరణాలు

|

Mar 10, 2019 | 9:44 AM

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని మూల విరాట్టును లేలేత భాను కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆ వెలుగుల రేడు సూర్యభగవానుడిపై ఉషోదయ వేళ స్వర్ణమయ కాంతులతో ప్రసరించిన కిరణాల అరుదైన దృశ్యాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఉషా పద్మిణీ ఛాయాదేవి సమేత ఆదిత్యుని పాదాల వద్ద తొలికిరణం తాకింది. సుమారు 10 నిమిషాల పాటు కనిపించిన కిరణ స్పర్శ […]

మూల విరాట్టును తాకిన భాను కిరణాలు
Follow us on

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని మూల విరాట్టును లేలేత భాను కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆ వెలుగుల రేడు సూర్యభగవానుడిపై ఉషోదయ వేళ స్వర్ణమయ కాంతులతో ప్రసరించిన కిరణాల అరుదైన దృశ్యాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఉషా పద్మిణీ ఛాయాదేవి సమేత ఆదిత్యుని పాదాల వద్ద తొలికిరణం తాకింది. సుమారు 10 నిమిషాల పాటు కనిపించిన కిరణ స్పర్శ భక్తులకు మరుపురాని మధురానుభూతిని కలిగించింది.

ఏటా మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. సూర్యకిరణాలు ఆలయంలోని సూర్యభగవానుడిని తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తుల నమ్మకం. అయితే, గత రెండేళ్లుగా సరిగా పడని కిరణాలు.. ఆదివారం సరిగ్గా స్వామివారిని తాకాయి. దీంతో దివ్య మంగళ స్వరూపుడైన భాస్కరుని విగ్రహం మరింత తేజోవంతమైంది. ఈ అద్భుత సన్నివేశాన్ని అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.