7గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం- శ్రీలంక రక్షణ శాఖ

|

Apr 21, 2019 | 5:47 PM

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 పేలుళ్లు జరిగాయని.. అందులో 190మంది చనిపోయారని తెలిపింది. పేలుళ్లలో మృతి చెందిన 185మందిలో 35 మంది విదేశీయులు అని తెలుస్తోంది. శ్రీలంకలో కర్ఫ్యూ.. నేటి రాత్రి రైళ్లన్నీ రద్దు లంకలో పేలుళ్ల నేపథ్యంలో రాబోయే 24గంటల పాటు ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ విధించిన రెండు గంటల తర్వాత […]

7గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం- శ్రీలంక రక్షణ శాఖ
Follow us on

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 పేలుళ్లు జరిగాయని.. అందులో 190మంది చనిపోయారని తెలిపింది. పేలుళ్లలో మృతి చెందిన 185మందిలో 35 మంది విదేశీయులు అని తెలుస్తోంది.

శ్రీలంకలో కర్ఫ్యూ.. నేటి రాత్రి రైళ్లన్నీ రద్దు

లంకలో పేలుళ్ల నేపథ్యంలో రాబోయే 24గంటల పాటు ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ విధించిన రెండు గంటల తర్వాత రైల్వే శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆదివారం రాత్రి రైళ్లన్నింటిని రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. అలాగే దేశంలోని అన్ని యూనివర్సిటీలు మూతపడ్డాయి. ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.