కరోనాపై బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్

|

Jul 28, 2020 | 11:35 PM

. ఐరోపా ఖండంపై రెండో కరోనా దాడి సెకెండ్ వేవ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా ప్రమాదం లేని దేశాల జాబితా నుంచి స్పెయిన్‌ను తొలగించిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

కరోనాపై బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్
Follow us on

కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచం కకావిళం అవుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. కొవిడ్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. కరోనా కట్టడికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్ చేశారు. ఐరోపా ఖండంపై రెండో కరోనా దాడి సెకెండ్ వేవ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా ప్రమాదం లేని దేశాల జాబితా నుంచి స్పెయిన్‌ను తొలగించిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. స్పెయిన్‌లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య మరోసారి పెరిగిందన్న ఆయన.. స్పెయిన్ నుంచి బ్రిటన్‌ను తిరిగొచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా రెండో దాడి జరగే సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యాత్మకమైన ప్రాంతాల విషయంలో మనం వేగంగా స్పందించాలన్నారు. కరోనా కట్టడికి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.