పుణెలో ఒక్కరోజే కొత్తగా 1,491 మందికి కరోనా

|

Jul 15, 2020 | 8:23 PM

మహారాష్ట్రలో కరోనా వికృతరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదైన పుణేలో రెండో దఫా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు.

పుణెలో ఒక్కరోజే కొత్తగా 1,491 మందికి కరోనా
Follow us on

మహారాష్ట్రలో కరోనా వికృతరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదైన పుణేలో రెండో దఫా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు.

పుణె జిల్లాలో కరోనా తీవ్రత తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒక్కరోజు పుణే జిల్లాలో దాదాపు 1,500 కేసులు వెలుగు చూశాయి. దీంతో పుణెలో రెండో విడత లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. జూలై 18 నుంచి జూలై 23 వరకూ పుణెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో జనం బయటకు రాకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు. అయితే, హాస్పిటల్స్, మెడికల్ స్టోర్స్, మిల్క్ డైరీలు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పుణె జిల్లాలో కొత్తగా 1,491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో.. 690 కేసులు పుణె నగరంలోనే నమోదు కావడం విశేషం. ఇప్పటివరకు పుణె జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 28,676 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

అటు, మహారాష్ట్రలో కరోనా మహమ్మారికి మరో 233 మంది మరణించారు. తాజాగా విడుదల చేసిన బులిటిన్‌లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,975 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,75,640కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 10,928 మంది మృతి చెందారు.3606 మంది రోగులు డిశ్చార్జి కాగా 1,52,613 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.