అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం

దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ‘ఇది కేవలం భూ వివాదం మాత్రమే […]

అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం

Updated on: Mar 06, 2019 | 12:41 PM

దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

‘ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదు. మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశం. గతాన్ని మనం మార్చలేం ప్రస్తుత వివాదాన్ని మాత్రమే మేం పరిగణనలోకి తీసుకుని దాన్ని పరిష్కరించాలని చూస్తాం. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అని భావిస్తున్నాం’ అని జస్టిస్‌ బోబ్డే అన్నారు.

సుప్రీంకోర్టు నేతృత్వంలోని మధ్యవర్తిత్వానికి ముస్లిం గ్రూపులు సమర్థించగా… హిందూత్వ సంస్థలు వ్యతిరేకించాయి.  కాగా దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ వివాదంపై పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమనీ.. ఏమాత్రం అవకాశం ఉన్నా మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.