మళ్ళీ జైపూర్ టూర్ లో సచిన్ పైలట్ బిజీ, సీఎం అశోక్ గెహ్లాట్ వర్రీ !

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే రాజస్థాన్ లో అసమ్మతి నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దే పైచేయిగా కనిపిస్తోంది. ఆయన అభిప్రాయాలకు విలువనిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం..

మళ్ళీ జైపూర్ టూర్ లో సచిన్ పైలట్ బిజీ, సీఎం అశోక్ గెహ్లాట్ వర్రీ !

Edited By:

Updated on: Aug 11, 2020 | 1:24 PM

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే రాజస్థాన్ లో అసమ్మతి నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దే పైచేయిగా కనిపిస్తోంది. ఆయన అభిప్రాయాలకు విలువనిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం, సచిన్ వైపు ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేల వాదనలను ఆ కమిటీ శ్రధ్దగా ఆలకించడం వంటి తాజా పరిణామాలు సీఎం అశోక్ గెహ్లాట్ లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. పైగా దాదాపు నెల రోజుల తరువాత ఢిల్లీ నుంచి సచిన్ పైలట్ తిరిగి  జైపూర్ కి వస్తుండడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అసంతృప్తిగా ఉన్న ఆయన జైసల్మీర్ బయలుదేరుతున్నారు. అక్కడ హోటల్లో ఉన్న తనవర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ నెల 14 నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంమవుతున్నందున సభలో తన బలపరీక్ష విషయమై ఆయన వారితో చర్చించనున్నారు.

గెహ్లాట్వ వర్గం  ఎమ్మెల్యేలలో చాలామంది తమ భ్రమలు తొలగిపోతున్నాయని నిరాశా నిస్పృహలకు గురవుతున్నారని, వారిని పార్టీ సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది. అసలు రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారని, వారిని జైపూర్ నగరంలోకి అనుమతించకూడదని వీరు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us