శ్రీలంక టెర్రర్ ఎటాక్‌లో..కేరళ వాసి మృతి

|

Apr 21, 2019 | 6:22 PM

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఒక భారతీయ పౌరుడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. కేరళలోని కసరగాడ్ జిల్లాకు చెందిన రసీనా అనే వ్యక్తి చనిపోయినట్టు పేర్కొన్నారు. శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో సుమారు 185 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, చనిపోయిన 185 మందిలో 35మంది విదేశీయులు ఉన్నట్టు సమాచారం. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా చర్చిలను ముష్కరులు టార్గెట్ […]

శ్రీలంక టెర్రర్ ఎటాక్‌లో..కేరళ వాసి మృతి
Follow us on

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఒక భారతీయ పౌరుడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. కేరళలోని కసరగాడ్ జిల్లాకు చెందిన రసీనా అనే వ్యక్తి చనిపోయినట్టు పేర్కొన్నారు. శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో సుమారు 185 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, చనిపోయిన 185 మందిలో 35మంది విదేశీయులు ఉన్నట్టు సమాచారం. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా చర్చిలను ముష్కరులు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. అందులో సూసైడ్ ఎటాక్స్ కూడా ఉన్నాయి.