రాజాసింగ్‌పై నిర్లక్ష్యం…ఆయన ఏంచేశారంటే!

ఈయన తెలంగాణ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే. రెండు సార్లు గెలిచారు. ఫైర్‌బ్రాండ్‌గా నేతగా పేరు. కానీ పార్టీలో మాత్రం ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్టీ సమావేశాలకు ఆయనకు పిలుపు రావడం లేదు. దీంతో ఆయన అనుచరులు ఇప్పుడు ఒకటే ఆవేదన చెందుతున్నారట. మా లీడర్‌ను ఎందుకు పిలవడం లేదు? ఆయన ఏం తప్పుచేశారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లకు, జూనియర్ల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయట. గోషామహాల్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌ ఇప్పుడు […]

రాజాసింగ్‌పై నిర్లక్ష్యం...ఆయన ఏంచేశారంటే!

ఈయన తెలంగాణ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే. రెండు సార్లు గెలిచారు. ఫైర్‌బ్రాండ్‌గా నేతగా పేరు. కానీ పార్టీలో మాత్రం ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్టీ సమావేశాలకు ఆయనకు పిలుపు రావడం లేదు. దీంతో ఆయన అనుచరులు ఇప్పుడు ఒకటే ఆవేదన చెందుతున్నారట. మా లీడర్‌ను ఎందుకు పిలవడం లేదు? ఆయన ఏం తప్పుచేశారని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో ఉన్న సీనియర్లకు, జూనియర్ల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయట. గోషామహాల్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌ ఇప్పుడు పార్టీలో సింగిల్‌ ఎమ్మెల్యే. అన్నట్లుగా పార్టీలోనూ సింగిల్ సింగ్‌గా మిగిలారట. పార్టీలోని ముఖ్య నేతలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదట.

ఈ మధ్య పార్టీ సమావేశాలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీనియర్‌ నేతలు ఆహ్వానించడం లేదట. కోర్‌ కమిటీ మీటింగ్‌లు పక్కన పెడితే… ఏ సమావేశానికి రాజాసింగ్‌‌ను కనీసం పిలవడం లేదట. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మున్సిపల్‌ ఎన్నికల వరకు కనీసం రాజాసింగ్‌ను ఇన్‌వాల్వ్‌ చేయలేదట. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గరలో ఉండే రాజాసింగ్‌ను సమావేశాలకు ఎందుకు పిలవడం లేదనేది ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

అయితే పార్టీ ఆఫీసు నుంచి మరో వెర్షన్‌ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలకు ఇంతకుముందు చాలా సార్లు రాజాసింగ్‌ను పిలిచామని…కానీ ఆయన రాకపోవడంతో ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. అయితే పార్టీ పెద్దలతో గ్యాప్‌ వల్లే రాజాసింగ్‌కు ఈ సమస్య వచ్చిందనేది కొందరి మాట. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు పార్టీ పెద్దలు కొందరు కుట్ర పన్నారని చాలాసార్లు రాజాసింగ్‌ ఆరోపించారు. దీంతో అప్పటి నుంచి ఆ నేతలను ఈయన్ని పట్టించుకోవడం లేదట. మొత్తానికి ఏకైక ఎమ్మెల్యేను పార్టీ పట్టించుకోవడం లేదనేది రాజాసింగ్‌ వర్గం ఆవేదన. అయితేనేం.. ఒకరిద్దరు జాతీయ స్థాయి నేతలతో రాజాసింగ్‌కు సత్సంబంధాలుండడంతో ఆయన ఒకింత ఊరటతో కనిపిస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

Published On - 7:02 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu