అక్కడ కూర్చొబెట్టుకుని ఒక్క ఫోటో తీశాడు.. అంతే..

| Edited By:

Nov 07, 2019 | 4:29 AM

ఫోటోస్ పిచ్చి.. నేడు పీక్ స్టేజ్‌కు చేరింది. ఎక్కడ దిగాలో ఎక్కడ దిగకూడదో అన్నది తెలియకుండా పోతోంది జనానికి. మన సరదాల కోసం.. దిగే ఫోటోలు.. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం అలవాటుగా మారింది. అయితే అలా పెట్టే సమయంలో కింద పెట్టే క్యాప్షన్.. ఓ వ్యక్తి ఉద్యోగం ఊడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. చైనాకి చెందిన ఓ యువతి.. విమాన ప్రయాణం చేస్తోంది. అయితే తొలిసారి ఎక్కిందో..మరేమో కానీ.. ఆ విమానంలో […]

అక్కడ కూర్చొబెట్టుకుని ఒక్క ఫోటో తీశాడు.. అంతే..
Follow us on

ఫోటోస్ పిచ్చి.. నేడు పీక్ స్టేజ్‌కు చేరింది. ఎక్కడ దిగాలో ఎక్కడ దిగకూడదో అన్నది తెలియకుండా పోతోంది జనానికి. మన సరదాల కోసం.. దిగే ఫోటోలు.. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం అలవాటుగా మారింది. అయితే అలా పెట్టే సమయంలో కింద పెట్టే క్యాప్షన్.. ఓ వ్యక్తి ఉద్యోగం ఊడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. చైనాకి చెందిన ఓ యువతి.. విమాన ప్రయాణం చేస్తోంది. అయితే తొలిసారి ఎక్కిందో..మరేమో కానీ.. ఆ విమానంలో ఫోటోలు దిగడం మొదలెట్టింది. అయితే విమానంలో అనుమతి లేని చోటు దగ్గర ఫోటో దిగేందుకు ప్రయత్నించింది. సాధారణంగా విమానంలో ఉండే కాక్‌పీట్‌లోకి ఎవర్నీ అనుమతించరు. దానిని పైలట్ చూసుకుంటాడు. అయితే అందులోకి ఎవర్నీ కూడా అనుమతించొద్దు. కానీ.. చైనాకి చెందిన ఓ పైలట్.. ఓ యువతి ఫోటో దిగుతానంటే.. అనుమతిచ్చాడు. అంతేకాదు.. ఆమె కాక్‌పీట్‌లో ఫోజులు పెట్టి దిగింది. అందుకు ఆ పైలట్‌తో పాటు.. మరికొందరు సిబ్బంది కూడా సహాయపడ్డారు. అయితే ఆ ఫోటోను సదరు యువతి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది వైరల్ గా మారింది. దీంతో విషయం విమాన సంస్థ యాజమాన్యానికి చేరింది. అంతే.. ఆ ఫోటో తీసిన పైలట్‌ ఉద్యోగాన్ని పీకేశారు. ఈ ఘటన జనవరి 4న చైనాలోని గుయిలిన్‌ నుంచి యాంగ్జోకు ఎయిర్‌ గుయిలిన్‌ విమానంలో జీటీ 1011లో చోటు చేసుకుంది. అయితే ఆ ఫోటో.. వైరల్‌గా మారి.. ఈ నెల విమాన సంస్థ కంటపడింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నఆ ఫోటోలో ఆ యువతి తన చేతి వేళ్లను ‘వి’ ఆకారంలో చూపిస్తూ.. ఫోటో కింద కెప్టెన్‌కు ధన్యవాదాలు , కాక్‌పిట్‌లో ఫొటో దిగడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొంది. ఆ కామెంట్ పైలట్‌ ఉద్యోగం పోయేలా చేసింది. అనుమతి లేకుండా కాక్‌పిట్‌లోకి సాధారణ ప్రయాణికుల్ని అనుమతించడం అనేది నిబంధనలు ఉల్లంఘించడమేనని.. అందుకే సదరు సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఎయిర్‌ గుయిలిన్‌ తెలిపింది.