31 లోపు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు చెల్లించాలి..

|

Mar 11, 2020 | 11:46 AM

గత ఆర్థిక సంవత్సరం(2019-20)గాను సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ బకాయిలను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ...

31 లోపు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు చెల్లించాలి..
Follow us on

గత ఆర్థిక సంవత్సరం(2019-20)గాను సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ బకాయిలను ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరంలో రూ.1800 కోట్ల ప్రాప‌ర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.1291.49కోట్లు వసూలైనట్టు తెలిపారు. ఇంకా రూ.508.51 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బ‌కాయిలు రావాల్సి ఉంద‌ని వివ‌రించారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు ట్యాక్స్‌ కలెక్టర్లు ఇంటింటికి తిరిగుతున్నట్లు తెలిపారు. అలాగే మీ సేవా, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా కూడా ట్యాక్స్‌ బకాయిలను చెల్లించవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ చెల్లింపుదారుల చార్జీలను జీహెచ్‌ఎంసీ భరిస్తుందన్నారు. చెల్లింపుల్లో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధిత‌ స‌ర్కిల్ కార్యాలయాల్లోని డిప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.