27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మహ్మద్‌ ఆమిర్!

| Edited By:

Jul 28, 2019 | 5:29 AM

పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ అమీర్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై శ్రద్ధపెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2009లో టెస్టు అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్‌ కేవలం 36 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 119 వికెట్లు పడగొట్టాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆమిర్‌ 2010లో స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకుని ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. తిరిగి 2016లో పునరాగమనం చేశాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లోనూ […]

27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మహ్మద్‌ ఆమిర్!
Follow us on

పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ అమీర్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై శ్రద్ధపెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2009లో టెస్టు అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్‌ కేవలం 36 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 119 వికెట్లు పడగొట్టాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆమిర్‌ 2010లో స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకుని ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. తిరిగి 2016లో పునరాగమనం చేశాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెరీర్‌ను పొడిగించుకోవడం కోసమే ఆమిర్‌ టెస్టులకు గుడ్‌బై చెప్పినట్లు పేర్కొన్నాడు. అయితే టెస్టు క్రికెట్‌లో చాలా కెరీర్‌ ఉన్నప్పటికీ అప్పుడే రిటైర్మెంట్ చెప్పడం సరైన నిర్ణయం కాదని మాజీ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

‘క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌ ఎప్పటికీ అత్యుత్తమం. అంత గొప్ప ఫార్మాట్‌కు 27 ఏళ్లకే ఆమిర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ పాక్‌కు అతని అవసరం ఎంతగానో ఉంది’. అని మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

‘పాకిస్థాన్‌ క్రికెట్‌లో అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు 27ఏళ్లకే అతను రిటైర్మెంట్‌ కావాల్సిన అవసరమేంటి? స్పాట్‌ ఫిక్సింగ్‌లో చిక్కుకున్నప్పుడు పాక్‌ అతనికి ఎంతగానో సహాయపడింది. చాలా అవకాశాలు ఇచ్చింది. ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్‌ ప్రకటించడం సరైన నిర్ణయం కాదు.’ అని మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ఆమిర్‌ నిర్ణయం తననెంతగానో నిరాశపరిచిందని మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా కూడా ట్విటర్‌ ద్వారా తెలిపాడు.