నిరుద్యోగులకు ఏపీ సీఎం అదిరిపోయే గిఫ్ట్

|

Oct 17, 2019 | 5:34 PM

ఏపీలో నిరుద్యోగ యువతకు చల్లటి కబురందించారు. ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన టైమ్ టేబుల్ ప్రకారం ఉద్యోగ నియమకాలు జరిగేలా ఏపీపీఎస్‌సీ నిబంధనలను సవరించాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ పర్వం లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఇవాళ ఏపీపీఎస్‌సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానంలో ఉద్యోగాల […]

నిరుద్యోగులకు ఏపీ సీఎం అదిరిపోయే గిఫ్ట్
Follow us on

ఏపీలో నిరుద్యోగ యువతకు చల్లటి కబురందించారు. ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన టైమ్ టేబుల్ ప్రకారం ఉద్యోగ నియమకాలు జరిగేలా ఏపీపీఎస్‌సీ నిబంధనలను సవరించాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ పర్వం లేకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఇవాళ ఏపీపీఎస్‌సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానంలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ఏపీపీఎస్‌సీ అధికారులను ఆదేశించారు.

ప్రతీ జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ విడుదల చేయాలని, యుపిఎస్‌సీ తరహాలో నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగాల భర్తీ పూర్తికావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీపీఎస్‌సీ నిర్వహించే ప్రతీ పరీక్షలో ఐఐటి, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. ఏపీపీఎస్‌సీ జారీ చేసే ప్రతీ నోటిఫికేషన్ కోర్టు కేసుల్లో ఇరుక్కుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇకపై అలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని, అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాలలో యుద్దప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.