కరోనాతో ముంబై నగరం విలవిల

మహరాష్ట్రలో ఇప్పటి వరకు 7,54,000 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,28,205 మందికి పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 3874 పాజిటీవ్‌ కేసులు .

కరోనాతో ముంబై నగరం విలవిల

Updated on: Jun 21, 2020 | 7:34 PM

మహారాష్ట్ర కరోనాతో అతలాకుతలం అవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహరాష్ట్రలో ఇప్పటి వరకు 7,54,000 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,28,205 మందికి పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 3874 పాజిటీవ్‌ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు 160 మంది కరోనా బారిన పడి మృతి చెందడంతో కోవిడ్‌ మరణాల సంఖ్య 5,984కు చేరింది. కరోనాతో చనిపోయిన 160మందిలో 136 మంది ఒక్క ముంబైకి చెందినవారే కావడం విశేషం. ముంబైలో ఇప్పటి వరకూ 65,329 పాజిటీవ్‌ కేసులు రాగా, 3,561 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.