బావ పిలిచాడు.. వైసీపీలోకి వెళుతున్నా

తన బావ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిలుపుతో వైసీపీలోకి వెళుతున్నానని.. తనతో పాటు వచ్చేవారు రావచ్చు అంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీడీపీకి రాజీనామా చేసిన మోదుగుల అనంతరం మాట్లాడుతూ 9న వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నానని, రాష్ట్రానికి విభజన హామీలు అమలు కావాలంటే, అది జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నానని మోదుగుల అన్నారు. అయితే పార్టీని వీడేముందు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో మోదుగుల […]

బావ పిలిచాడు.. వైసీపీలోకి వెళుతున్నా

Updated on: Mar 06, 2019 | 11:03 AM

తన బావ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిలుపుతో వైసీపీలోకి వెళుతున్నానని.. తనతో పాటు వచ్చేవారు రావచ్చు అంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీడీపీకి రాజీనామా చేసిన మోదుగుల అనంతరం మాట్లాడుతూ 9న వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నానని, రాష్ట్రానికి విభజన హామీలు అమలు కావాలంటే, అది జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నానని మోదుగుల అన్నారు. అయితే పార్టీని వీడేముందు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో మోదుగుల గ్రూప్ ఫొటో తీసుకోవడం విశేషం.

Loading...
Unable to load recommendations.
Follow Us