డేటా చోరిపై అసత్య ప్రచారం జరుగుతోంది: కోడెల

డేటా చోరికి గురి అయ్యిందంటూ టీఆర్ఎస్, తెలంగాణ పోలీసులు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. డేటా చోరీ అంశంపై అసత్య ప్రచారం జరుగుతోందని, ప్రజలను తికమకపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తు్న్నారని మండిపడ్డారు. వైసీపీ వారి ఓట్లను తాము లేకుండా చేస్తున్నామంటూ చేస్తున్న ఆరోపణలు దొంగే దొంగను పట్టుకోండి అన్నట్లుగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సలహాలు జగన్ రాజకీయ సలహారుడు ప్రశాంత్ కిశోర్ ఇస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఓ […]

డేటా చోరిపై అసత్య ప్రచారం జరుగుతోంది: కోడెల

Edited By:

Updated on: Mar 05, 2019 | 3:58 PM

డేటా చోరికి గురి అయ్యిందంటూ టీఆర్ఎస్, తెలంగాణ పోలీసులు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. డేటా చోరీ అంశంపై అసత్య ప్రచారం జరుగుతోందని, ప్రజలను తికమకపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తు్న్నారని మండిపడ్డారు.

వైసీపీ వారి ఓట్లను తాము లేకుండా చేస్తున్నామంటూ చేస్తున్న ఆరోపణలు దొంగే దొంగను పట్టుకోండి అన్నట్లుగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సలహాలు జగన్ రాజకీయ సలహారుడు ప్రశాంత్ కిశోర్ ఇస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఓ స్పీకర్‌గా తన బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పిన కోడెల, రాజకీయాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని అన్నారు. టీడీపీ తనకు రాజకీయ జీవితం ఇచ్చిందని, పార్టీ కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.

Follow Us