జమ్మూ కాశ్మీర్లో 11 న ఉగ్రదాడికి జైషే ప్లాన్

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 4:07 PM

జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల 11 న భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ లోని టెర్రరిస్టు సంస్థ జైషే మహమ్మద్ ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత భద్రతా దళాలపై ఫిదాయీ దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నట్టు ఈ వర్గాలకు సమాచారం అందింది. గత ఏప్రిల్ నెలలో 28 మంది ఉగ్రవాదులు...

జమ్మూ కాశ్మీర్లో 11 న ఉగ్రదాడికి జైషే ప్లాన్
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల 11 న భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ లోని టెర్రరిస్టు సంస్థ జైషే మహమ్మద్ ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత భద్రతా దళాలపై ఫిదాయీ దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నట్టు ఈ వర్గాలకు సమాచారం అందింది. గత ఏప్రిల్ నెలలో 28 మంది ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో హతులయ్యారు. దానికి ప్రతీకారంగా మే 11 న ఆత్మాహుతి దాడులకు సైతం సిధ్దంగా ఉండాలని జైషే నాయకత్వం తమ సభ్యులకు సూచించినట్టు సమాచారం. ఇందుకోసం సుమారు 30 మంది టెర్రరిస్టులు కాశ్మీర్ లోయలోకి చొరబడవచ్చు. ఇటీవల జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ కి,  పాక్ ఐఎస్ఐ సీనియర్ అధికారులకు మధ్య జరిగిన సమావేశంలో ఈ పథక రచనకు కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించారట. అటు- నిన్న పుల్వామా జిల్లా దంగర్ పురాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇలా ఉండగా.. పాకిస్థాన్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న సుమారు యాభై మంది ఉగ్రవాదులను కరోనా సాకుతో విడుదల చేసినట్టు తెలుస్తోంది.