జగన్ పై బయోపిక్ తీస్తే సూపర్ హిట్ అవుతుంది..!

| Edited By:

Feb 18, 2019 | 1:00 PM

అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ పై బయోపిక్ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. బీసీ గర్జనలో జగన్ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నాడని.. అలాంటి విచిత్రమైన హామీలు ఎక్కడా వినలేదని అన్నారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న హామీలనే కాపీ చేసి జగన్ తన హామీలుగా ప్రకటిస్తున్నారని అన్నారు బుద్ధా. సీఎం చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందని.. అదే జగన్ అధికారలోకి వస్తే శ్మశానమవుతుందని ఘాటుగా […]

జగన్ పై బయోపిక్ తీస్తే సూపర్ హిట్ అవుతుంది..!
Follow us on

అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ పై బయోపిక్ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. బీసీ గర్జనలో జగన్ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నాడని.. అలాంటి విచిత్రమైన హామీలు ఎక్కడా వినలేదని అన్నారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న హామీలనే కాపీ చేసి జగన్ తన హామీలుగా ప్రకటిస్తున్నారని అన్నారు బుద్ధా. సీఎం చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందని.. అదే జగన్ అధికారలోకి వస్తే శ్మశానమవుతుందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికలు వస్తున్నందునే బీసీపై జగన్ ముసలి కన్నీరు కార్చుతున్నాడని లేదంటే అసలు బీసీల గురించి జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చేతులు కలిపి మన రాష్ట్రానికే అన్యాయం చేస్తున్నాడని విమర్శలు చేశారు. ఇదే విదేశాల్లో అయితే ఈ పాటికి వైఎస్ జగన్ ఊచలు లెక్కపెడుతూండేవని అన్నారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.