ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్

|

Jan 13, 2020 | 3:58 PM

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా ప్రజలపై ఏపీ పోలీసుల ప్రవర్తన చట్ట విరుద్దంగా వుందని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ఆందోళనలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను, మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో నెలకొన్న అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 144 సెక్షన్, లాఠీఛార్జ్ వంటి అంశాలను సుమోటోగా తీసుకొన్న హైకోర్టు.. శాంతియుత నిరసనలకు కూడా అనుమతి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించింది. […]

ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
Follow us on

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా ప్రజలపై ఏపీ పోలీసుల ప్రవర్తన చట్ట విరుద్దంగా వుందని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ఆందోళనలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను, మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో నెలకొన్న అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

144 సెక్షన్, లాఠీఛార్జ్ వంటి అంశాలను సుమోటోగా తీసుకొన్న హైకోర్టు.. శాంతియుత నిరసనలకు కూడా అనుమతి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించింది. తాజా పరిణామాలపై పలువురు హైకోర్టు న్యాయవాదులు హైకోర్టులో మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.

గ్రామీణ ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ జరగటం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు.. కర్ఫ్యూ వాతావరణం అమలులో ఉన్నట్లు కనిపిస్తుందని హైకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వటం లేదని పోలీసు ఉన్నతాధికారులను నిలదీసింది. మహిళలను, పిల్లలను కూడా బయటకు రానివ్వకపోవడంపై అభ్యంతరం తెలిపింది. కనీస అవసరాల కోసం కూడా అనుమతించడం లేదని పలువురు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దాఖలైన అన్ని పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.