బిగ్ బ్రేకింగ్: ‘తెలంగాణ సచివాలయం’ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

| Edited By:

Jul 17, 2020 | 3:49 PM

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేసింది తెలంగాణ హైకోర్టు. భవనాల కూల్చివేతకు పర్యావరణ వాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అలాగే తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని..

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Follow us on

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టి వేసింది తెలంగాణ హైకోర్టు. భవనాల కూల్చివేతకు పర్యావరణ వాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అలాగే తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు. అలాగే కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. నిబంధనలు పాటిస్తూ సెక్రటేరియెట్ భవనాల కూల్చివేతకు పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి టీఎస్ హైకోర్టు సూచించింది.

భవనాల కూల్చివేతకు కేంద్రం అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అన్నారు. నూతన నిర్మాణాలు చేపట్టడానికే మా అనుమతులు కావాలని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసిటర్ జనరల్ వాదనను ఏకీభవించింది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందని పేర్కొంది హైకోర్టు.

Read More: 

మాస్క్ విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..

ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని మండే సూర్యుడి అద్భుత చిత్రాలు..

ఛార్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరోయిన్..