దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు కేరళలో గురువారం నమోదైంది. బాధితుడు చైనాలో విద్యనభ్యసిస్తూ సెలవుల్లో ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కనుగొన్న తర్వాత బాధితుడు 28 రోజుల్లో చనిపోతాడని చెబుతున్న నేపథ్యంలో బాధితునికి మరణం తప్పదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితుని పేరుతో పాటు వివరాలు వెల్లడించేందుకు కేరళ వైద్యబృందం నిరాకరిస్తున్నప్పటికీ.. సదరు విద్యార్థి చైనాలోని వూహన్ యూనివర్సిటీలో చదువుతున్నాడని తెలుస్తోంది. బాధితున్ని ప్రసుత్త ఐసోలేషన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు, మరిన్ని జాగ్రత్తల కోసం కేరళ ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు.
ఇదిలా వుండగా.. కరోనా వైరస్ సోకితే మరణం తప్పదని వైద్యవర్గాలంటున్నాయి. వైరస్ సోకిన వ్యక్తి 28 రోజుల్లో మరణిస్తాడని హెచ్చరిస్తున్న వైద్యులు.. బాధితునిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుంటే కేవలం పది రోజుల్లోనే మృత్యువాత పడతాడని అంటున్నారు. తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉంటే ముందుగా చనిపోయే అవకాశం ఉంటుందని, కరోనా వైరస్ మొదటగా ఊపిరితిత్తుల మీద దాడి చేసి ఆ తర్వాత శరీరంలోని అన్ని అవయవాలను నాశనం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జలుబుతో ప్రారంభమై చిన్న చిన్నగా కిడ్నీల వరకు అన్ని అవయవాల పనితీరులో మార్పులు వస్తాయని వివరిస్తున్నారు వైద్యులు.