
మహారాష్ట్రలో మరో కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్నికీలలు అంటుకున్నాయి. పుణెలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్స్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆ హాస్పిటల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం దవాఖానలోని ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే క్రమంగా అవి పక్కవార్డుల్లోకి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మూడు ఫైరింజ్లన సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.