బ్రేకింగ్.. 82 విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టుల్లో గందరగోళం.. ప్రయాణికుల ఆగ్రహం

రెండు నెలల తరువాత దేశంలో అన్ని విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం విమాన సర్వీసుల పునరుధ్ధరణ జరగవలసి ఉండగా 82 విమానాలు రద్దయ్యాయి.

బ్రేకింగ్.. 82 విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టుల్లో గందరగోళం.. ప్రయాణికుల ఆగ్రహం

Edited By:

Updated on: May 25, 2020 | 11:20 AM

రెండు నెలల తరువాత దేశంలో అన్ని విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం విమాన సర్వీసుల పునరుధ్ధరణ జరగవలసి ఉండగా 82 విమానాలు రద్దయ్యాయి. దేంతో ఎయిర్ పోర్టుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎయిర్ లైన్స్ నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదంటూ ప్యాసింజర్లు సిబ్బందితో వాదులాటకు దిగారు. చివరి క్షణం వరకు మాకు విమానాల క్యాన్సిల్ గురించి ఎందుకు తెలియజేయలేదని వారు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి బయల్దేరవలసిన, రావలసిన విమానాలు చాలావరకు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అసలు ఎయిర్ పోర్టులకు తాము చేరుకున్న తరువాతే ఈ విమానాల రద్దు విషయం చెప్పారని ప్రయాణికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.