హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం

| Edited By:

Feb 22, 2019 | 7:35 AM

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నుండి 50 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ముఠా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘనా దేశానికి చెందిన గెనెవివే అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడాలో కొకైన్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు […]

హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం
Follow us on

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నుండి 50 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ముఠా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘనా దేశానికి చెందిన గెనెవివే అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడాలో కొకైన్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ఓ హోటల్ పై దాడులు నిర్వహించారు. మహిళ దగ్గర ఉన్న డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని.. ఆమె పాస్ పోర్ట్ సీజ్ చేశారు.

సోమాజిగూడాలోని ఓ హోటల్ లో ఓయో యాప్ ద్వారా రూప్ బుక్ చేసుకుంది గెనెవినా. గోవాలో ఉన్న ఓ డ్రగ్స్ ముఠా సూచన మేరకు.. హైదారబాద్ లో ముందే సెలక్ట్ చేసిన వ్యక్తులకు కొకైన్ సప్లై చేసేందుకు సిద్ధమైంది ఆమె. తన కాల్ డేటాలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.