ఈ నెల 20 నుంచి మళ్ళీ కీలక రంగాల “ఉత్తేజం”

ఏప్రిల్ 20 నుంచి దేశవ్యాప్తంగా పని చేసే ఆయా రంగాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ లిస్టును తన ట్విటర్ లో రిలీజ్ చేస్తూ.. ఇవి కంటెయిన్మెంట్ జోన్లకు మాత్రం వర్తించవని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ మే నెల 3 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన అనంతరం పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల పునరుధ్దరణకు ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. కాగా ఈ నెల 20 నుంచి […]

ఈ నెల 20 నుంచి మళ్ళీ కీలక రంగాల ఉత్తేజం

Edited By:

Updated on: Apr 18, 2020 | 4:38 PM

ఏప్రిల్ 20 నుంచి దేశవ్యాప్తంగా పని చేసే ఆయా రంగాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ లిస్టును తన ట్విటర్ లో రిలీజ్ చేస్తూ.. ఇవి కంటెయిన్మెంట్ జోన్లకు మాత్రం వర్తించవని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ మే నెల 3 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన అనంతరం పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాల పునరుధ్దరణకు ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.

కాగా ఈ నెల 20 నుంచి తిరిగి ‘ప్రాణం పోసుకోనున్న’ రంగాలు.

ఆయుష్ తో సహా అన్ని ఆరోగ్య సర్వీసులు.

అన్ని వ్యవసాయక, తోటల పెంపక కార్యకలాపాలు.

ఫిషింగ్.. మెరైన్, ఇన్ ల్యాండ్.. ఆక్వా కల్చర్ ఇండస్ట్రీ.

50 శాతం సిబ్బందితో పని చేయనున్న టీ, కాఫీ, రబ్బర్ ప్లాంటేషన్లు.

పశు సంవర్ధక శాఖ కార్యకలాపాలు.

ఫైనాన్షియల్ రంగం.

సోషల్ సెక్టార్.

ఎంఎన్ఆర్ఈజీఏ పనులు.

పబ్లిక్ యుటిలిటీస్.

వస్తువులు, సరకుల లోడింగ్, అన్-లోడింగ్.

ఆన్ లైన్ టీచింగ్..డిస్టెన్స్ లర్నింగ్.

నిత్యావసర వస్తువుల సరఫరా.

కమర్షియల్, ప్రైవేట్ సంస్థలు.

ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు.

నిర్మాణ రంగ కార్యకలాపాలు.

ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉండే ప్రైవేటు వాహనాలు.

భారత, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు.