AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News మెడికల్ షాపులపై ఆంక్షలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండా నో మెడిసిన్

తెలంగాణ మెడికల్ షాపులపై తీవ్రమైన ఆంక్షలు మోపింది కేసీఆర్ సర్కార్. శనివారం మధ్యాహ్నం తాజా ఆదేశాలను జారీ చేసింది. దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది...

Breaking News మెడికల్ షాపులపై ఆంక్షలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండా నో మెడిసిన్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 4:25 PM

Share

తెలంగాణ మెడికల్ షాపులపై తీవ్రమైన ఆంక్షలు మోపింది కేసీఆర్ సర్కార్. శనివారం మధ్యాహ్నం తాజా ఆదేశాలను జారీ చేసింది. దగ్గు, జ్వరం, జలుబు అంటూ వచ్చే వారికి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది. వాటి కారణంగా స్వల్పంగా రిలీఫ్ వుండడంతో కరోనా పరీక్షలకు కొందరు రావడం లేదన్న ఉద్దేశంతో మెడికల్ షాపులపై ఆంక్షలకు తెరలేపింది కేసీఆర్ ప్రభుత్వం.

మెడికల్ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దగ్గు, జలుబు, జ్వరం అని వస్తే మందులు అమ్మొద్దని హెచ్చరించింది. డాక్టర్లప్రిస్కిప్షన్ లేనిదే జ్వరం..దగ్గు..జలుబు మందులు సైతం అమ్మవద్దని ఆదేశించింది. సాధారణ మందుల అమ్మకాలు.. దగ్గు టానిక్‌లపై సైతం నియంత్రణ విధించింది ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ.

జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెడికల్ షాపులు, అసోసియేషన్లకు సైతం ఆదేశాలిచ్చిన అధికారులు.. దగ్గు, జలుబు, జ్వరం కరోనా లక్షణాలు కావడంతో అవి కనిపించిన వారు ప్రభుత్వం ఇచ్చే మందులను మాత్రమే వాడాలని, వారికి రెగ్యులర్‌గా వాడే మందులను విక్రయించవద్దని తాజా ఆదేశాలలో పేరర్కొన్నారు. ఎలాంటి రొంప జ్వరం ఉన్నా… ఇక వైద్యుల వద్దకు వెళ్ళవలసిన పరిస్థితి తాజా ఆదేశాలతో కలుగుతుంది. వారిని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మేరకు క్వారెంటైన్, ఐసొలేషన్ వార్డులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. లేకపోతే.. అవసరమైన మందులిచ్చి ఇంటికి పంపాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

Follow Us
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త