కొలంబోలో కర్ఫ్యూ

| Edited By:

Apr 21, 2019 | 5:05 PM

వరుస బాంబు పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. మరోవైపు కొలంబోలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 185 మందికిపైగా […]

కొలంబోలో కర్ఫ్యూ
Follow us on

వరుస బాంబు పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. మరోవైపు కొలంబోలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది.

ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 185 మందికిపైగా మృతి చెందారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగాయి. కొలంబోలోని చర్చితో పాటు మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. నెగోంబో, బట్టికలోవా పట్టణాల్లో చర్చిలు, హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిల దగ్గరికి క్రైస్తవులు భారీగా చేరుకున్నారు. ఒక్క నెగోంబో పట్టణంలోనే 50 మంది మృతి చెందారు. బట్టికలోవా ఆస్పత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. ఆరు చోట్లు పేలుళ్లు, మరో రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. జహ్రెయిన్‌, అబు మహ్మద్‌ ఆత్మాహుతికి పాల్పడినట్లు గుర్తించారు.