రేపటి నుంచి రాజ్యాంగ దినోత్సవాలు..

|

Nov 25, 2019 | 9:35 PM

నెల్లూరుః రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ (డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి) వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సమగ్ర శిక్షాభియాన్‌ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ ప్రతిజ్ఞను విద్యార్థులతో చదివించేందుకు ప్రత్యేక అసెంబ్లీని నిర్వహించాలని హెచ్‌ఎంలను ఆదేశించామని తెలిపారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చర్చలు, వ్యాసరచన, క్వీజ్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, […]

రేపటి నుంచి రాజ్యాంగ దినోత్సవాలు..
Follow us on

నెల్లూరుః రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ (డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి) వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సమగ్ర శిక్షాభియాన్‌ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ నెల 26వ తేదీన అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ ప్రతిజ్ఞను విద్యార్థులతో చదివించేందుకు ప్రత్యేక అసెంబ్లీని నిర్వహించాలని హెచ్‌ఎంలను ఆదేశించామని తెలిపారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చర్చలు, వ్యాసరచన, క్వీజ్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. డిసెంబరులో ప్రతిరోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో ప్రాథమిక విధులు, బాధ్యతలపై విద్యార్థులతో చెప్పిస్తామన్నారు. కరపత్రాలు, బ్రోచర్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్దేశించిన అంశాలపై చర్చలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు, లఘు నాటికలు, మాక్‌ పార్లమెంట్‌, ప్రజా సందేశాలు చేపడతామన్నారు. ఫిబ్రవరిలో న్యాయవాదులు, మేధావులతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14వ తేదీన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థులకు అన్ని రకాల పోటీలు పాఠశాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు