ఉత్తర ఢిల్లీలోని మంజు కాటిల్లా పోలింగ్ కేంద్రం పరిధిలో శనివారం కాంగ్రెస్, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గతంలో ఆప్ ఎమ్మెల్యే గా ఉండి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్కా లాంబాను ఉద్దేశించి.. హర్మేష్ అనే ఆప్ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్య చేయడంతో.. ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే అతడ్ని సమీపించి చెయ్యెత్తి కొట్టబోగా ఆ యువకుడు తప్పించుకున్నాడు. పోలీసులు అతడిని తరిమివేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అతడిపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని వారిస్తూ హర్మేష్ ను దూరంగా తీసుకుపోయారు.
తాను పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తుండగా.. ఈ వ్యక్తి పోలింగ్ బూత్ లోకి ప్రవేశించబోతు పోలీసులతో వాదులాటకు దిగాడని, తనను అసభ్యంగా దూషించాడని అల్కా లాంబా ఆ తరువాత తెలిపారు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినందుకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ వీడియో వైరల్ అయింది.
#WATCH Delhi: Scuffle breaks out between AAP and Congress workers near Majnu ka Teela, Congress candidate Alka Lamba tries to slap an AAP worker. AAP leader Sanjay Singh has said the party will complain to Election Commission. #DelhiElections2020 (note: abusive language) pic.twitter.com/l5VriLUTkF
— ANI (@ANI) February 8, 2020