అదృష్టం మెర్సిడస్ బెంజ్ ఎక్కించింది. అదే కారు అతడిని జైలుపాలు చేసింది. తన్నిక్కోట్టు గ్రూప్ అధినేత రాయ్ కురియన్ కొవిడ్ నిబంధలను ఉల్లంఘించి అడ్డంగా బుక్కయ్యాడు. కారును కొనుగోలు చేసిన రోజే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
కేరళలోని కోఠమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో తాను కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడస్ బెంజ్ కారుతో రోడ్ షో నిర్వహించాడు. ఓపెన్ టాప్ మెర్సిడస్ బెంజ్ కారు మీద తెగ ఫోజులు కొట్టాడు. కొత్తగా కొన్న లారీలతో కలిసి వడత్తుపర నుండి రోడ్ షో నిర్వహించాడు. ఇది గమనించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ఇతను గత నెలలోనూ ఓ సారి ఇలాగే అరెస్ట్ అయ్యాడు. ఇడుక్కిలోని ఒక రిసార్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలను ధిక్కరించి అర్ధరాత్రి పార్టీ నిర్వహించాడు. బెల్లి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అతనిపై చర్యలు తీసుకుకున్నారు పోలీసులు. ఇప్పుడు తాజగా ఇలా దొరికి పోయాడు.