35 రోజుల నుంచి సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎండింగ్ ఎక్కడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు ప్రభుత్వం, ఇటు ఎంప్లాయిస్ ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఇష్యూ పరిష్కారం దిశగా కాకుండా సంక్షోభం దిశగా సాగుతోంది. చర్చలు జరపాలని హైకోర్టు చెబుతున్నా ఆ వాతావరణం మాత్రం కనిపించడం లేదు. పోలీసుల అనుమతి లేని సకలజనుల సామూహిక దీక్ష కార్యక్రమం ఇప్పటికే అరెస్టులతో పరిస్థితిని దిగజారుస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు, మధ్యలో విపక్షాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది. విపక్షాలు సమస్యను జటిలం చేస్తాయా, పరిష్కారానికి సహకరిస్తాయా అన్నది ఒక అంశం. అలాగే ఆర్టీసీ చట్టబద్ధత, రూట్ల ప్రైవేటీకరణ, ఆస్తులు-అప్పులు మరో సంక్లిష్టమైన అంశం.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 35 రోజులుగా చేస్తున్న సమ్మె మరో మలుపు తిరిగింది. ఛలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి రాకపోవంతో, సకలజనల సామూహిక దీక్ష అని పేరుపెట్టినా, పోలీసులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇక ఇదే ఇష్యూపై టీవీ9 బిగ్ న్యూస్ వేదికగా..మేనిజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో కీలక చర్చ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష వైఖరి అవలంభిస్తోంది? ఆర్టీసీని ప్రయివేటీకరణ చెయ్యడానికే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా..?..ఇలాంటి ఆరోపణలన్నీ..ప్రతిపక్షాల నుంచి, ఆర్టీసీ యూనియన్ల నుంచి వినిపిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య వివరణ ఇచ్చారు. ఆ అబ్డేట్స్ దిగువ వీడియోలో..