విపక్షాలపై విరుచుకుపడ్డ సజ్జల

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల వెనక కచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడున్నాడని సంచలన ఆరోపణలు చేశారు జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజాసంక్షేమం ఎవ్వరూ ఆపలేరన్నారు. టీటీడీ పిలుపు మేరకే సీఎం తిరుపతికి వెళ్లారన్న సజ్జల.. అక్కడ కూడా డిక్లరేషన్ పై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. జగన్ కి హిందూ ధర్మం అచారారాలపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉందన్నారు. జగన్ ఒక కులానికి, ఒక మతానికి […]

విపక్షాలపై విరుచుకుపడ్డ సజ్జల

Updated on: Sep 24, 2020 | 3:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల వెనక కచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడున్నాడని సంచలన ఆరోపణలు చేశారు జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజాసంక్షేమం ఎవ్వరూ ఆపలేరన్నారు. టీటీడీ పిలుపు మేరకే సీఎం తిరుపతికి వెళ్లారన్న సజ్జల.. అక్కడ కూడా డిక్లరేషన్ పై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. జగన్ కి హిందూ ధర్మం అచారారాలపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉందన్నారు. జగన్ ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు.. జగన్ ప్రజా నేత.. అందరివాడు అని ఆయన చెప్పుకొచ్చారు. సున్నితమైన అంశాన్ని కూడా పచ్చ మీడియా ద్వారా లేని పోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు పెట్టుకునే లక్ష్యాలు దురుద్దేశ్యపూరితమైనవని ఆయన అన్నారు. గత ఏడాదిన్నర పాలనలో రాష్ట్ర శ్రేయస్సు తప్ప మరో ఆలోచన లేకుండా జగన్ సమర్థవంతంగా ప్రజా పాలన చేస్తున్నారని.. మహిళా సాధికారతకు, భద్రతకు పెద్దపీట వేశారని సజ్జల చెప్పారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు కృత్రిమ అల్లర్లు సృష్టిస్తున్నాయని.. జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత తేవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన తాడేపల్లిలో ఆరోపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us