నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే.. ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం

| Edited By:

Jul 20, 2019 | 4:26 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలను చర్చించి ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగాన్ని నిర్మూలించే […]

నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే.. ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం
Follow us on

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలను చర్చించి ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

నిరుద్యోగాన్ని నిర్మూలించే దిశగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించాలని నిర్ణయించారు. ఇక టెండర్లలో అవినీతి, అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శతకు పెద్దపీట వేస్తూ న్యాయపరిశీలన – పారదర్శకత చట్టం- 2019 తీసుకువచ్చారు. ప్రభుత్వ నామినేషన్‌ కాంట్రాక్టులు, సర్వీసుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.”వైఎస్సార్‌ నవోదయం” పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ఈ పథకాన్ని రూపొందించారు. పాదయాత్రలో  భాగంగా .. వెనుకబడిన  వర్గాలకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు.  రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అదే విధంగా 1993 నాటి లోకాయుక్త చట్టాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ లేదా మాజీ జడ్జీల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకాయుక్తగా ఇప్పటివరకు హైకోర్టు జడ్జి లేదా మాజీ చీఫ్‌ జస్టిస్‌లకు మాత్రమే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ను నియమించేందుకు వీలుగా దేవదాయ చట్టంలో సవరణలు తేవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలకమైన అంశాల్లో ముసాయిదా బిల్లులకు ఆమోదం లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.