Godavari Boat Accident: బోటు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఈ దుర్ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని బోట్ల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా బోట్లలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన నైపుణ్యం ఉందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని […]

Godavari Boat Accident: బోటు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో

Edited By:

Updated on: Sep 15, 2019 | 5:30 PM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఈ దుర్ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని బోట్ల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా బోట్లలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన నైపుణ్యం ఉందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు సీఎం జగన్.

ఈ ప్రమాదంపై దగ్గర్లో అందుబాటులో ఉన్న మంత్రులంతా ఘటనా స్ధలానికి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. బోటు ప్రమాదంలో గల్లంతయినవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు, నేవీ, ఓఎన్జీసీ హెలీకాప్లర్లను సైతం వినియోగించాలన్నారు జగన్. ప్రస్తుతం దేవీపట్నం వద్ద బోటు ప్రమాదానికి సబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.