శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు , హోటళ్లే లక్ష్యంగా ఈరోజు వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 250 మంది చనిపోగా, 400 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనపై స్పందించారు. ఈ దాడిని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ.. ‘ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చ్ లు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయమైన చర్య. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి దారుణ ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, బాధితులకు అండగా నిలబడాలి’ అని ట్వీట్ చేశారు.
ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చిలు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేళుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి దారుణ ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, బాధితులకు అండగా నిలబడాలి.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 21, 2019