మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు

|

Oct 22, 2019 | 4:37 PM

‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే వండరే అంటున్నారు. సుమారు వారం రోజులవరకు ఆ టేస్ట్ నాలుక మీద అలాగే నిలిచిపోతుందట. అన్నట్టు ఈ భారీ మత్స్యాన్ని ‘ […]

మోయలేని బరువు.. తింటే మాత్రం నిండిపోయే కడుపు
Follow us on

‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే వండరే అంటున్నారు. సుమారు వారం రోజులవరకు ఆ టేస్ట్ నాలుక మీద అలాగే నిలిచిపోతుందట. అన్నట్టు ఈ భారీ మత్స్యాన్ని ‘ పిరారుకు ‘ అని వ్యవహరిస్తున్నారు. అమెజాన్ లో లభ్యమయ్యే ఇది ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటున్నారు.
ఒకప్పుడు ఈ జాతి చేపలు అంతరించిపోయే స్థితికి చేరుకోవడంతో.. ఇలాంటి చేపలత్జో పసందైన డిష్ లను వండే మాస్టర్ షెఫ్ లు, ఇతర నిపుణులు కలిసి వీటిని జాగ్రత్తగా ఫ్రెష్ వాటర్ లో పెంచే ప్రక్రియను చేబట్టారు. ఈ చేపను తినకపోతే ఇక ఈ జన్మ వృధా అని బ్రెజిల్ లో ఫ్రెడరిక్ అనే మాస్టర్ కుక్ అంటున్నాడు. అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దీన్ని రుచికరంగా వండి కస్టమర్లకు అందిస్తున్నారు. నిన్న మొన్నటివరకు ‘ ఆమెజానియన్ కాడ్ ‘ అని పిలుచుకునే చేపే చాలా టేస్టీ అనుకునేవారు.. కానీ పిరారుకు వచ్చాక.. ఆ చేప తాలూకు డిష్ హోటళ్లలో ‘ మాయమైంది ‘. అన్నట్టు పిరారుకు డిష్ ఒక ముక్క 17 డాలర్లట.. అయినా ధరకు వెనకాడకుండా కస్టమర్లు దీన్ని లాగించేస్తున్నారు.