బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ ఆకుమర్తి జ్యోతి

|

Sep 29, 2020 | 6:11 PM

దుబాయ్ లో మహిళలను నిర్బంధింఛి వ్యభిచారంలోకి దిపుతున్న కేసులో నిందితురాలు ఆకుమర్తి జ్యోతి ఎట్టకేలకు పోలీస్ లకు చిక్కింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఆమెను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11మంది మహిళలు తమను రక్షించమని సీఎం జగన్ విజ్ఞప్తి చేసిన ఘటనలో జ్యోతి నిందితురాలు. దీనిపై ఏపీ ప్రభుత్వం పూనుకొని ఎంబసీ ద్వారా రాష్ట్రానికి చెందిన బాధిత మహిళలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి […]

బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ ఆకుమర్తి జ్యోతి
Follow us on

దుబాయ్ లో మహిళలను నిర్బంధింఛి వ్యభిచారంలోకి దిపుతున్న కేసులో నిందితురాలు ఆకుమర్తి జ్యోతి ఎట్టకేలకు పోలీస్ లకు చిక్కింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఆమెను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. 2019 లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11మంది మహిళలు తమను రక్షించమని సీఎం జగన్ విజ్ఞప్తి చేసిన ఘటనలో జ్యోతి నిందితురాలు. దీనిపై ఏపీ ప్రభుత్వం పూనుకొని ఎంబసీ ద్వారా రాష్ట్రానికి చెందిన బాధిత మహిళలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లు కు చెందిన ఆకుమర్తి జ్యోతి పై రాష్ట్రంలోని మొగల్తూరు, టి.నరసాపురం, కలిదిండి, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసిన పోలీసులు లుకవుట్ నోటీస్ ఇష్యు చేశారు. అయితే, ఇప్పుడు జ్యోతి దుబాయ్ నుండి బెంగళూరుకు రాగా ఎయిర్ పోర్ట్ అధికారుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.