మనుషుల అక్రమ రవాణా.. ఆ ముగ్గురికి టర్కిష్ కోర్టు సంచలన తీర్పు..

| Edited By:

Mar 17, 2020 | 11:44 AM

టర్కిష్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మానవ అక్రమ రవాణా చేస్తూ.. ఎంతో మంది చావుకు కారణమైన ముగ్గురికి 125 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత.. టర్కిష్ కోర్టు తీర్పును వెలువరించింది. 2015 సెప్టెంబరు నెలలో సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన మూడున్నరేళ్ల చిన్నారి అలెన్ కుర్దీ మృతి.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది. ఆ బాలుడి చిత్రం అప్పట్లో ప్రపంచం గుండెలను పిండేసింది. ఈ చిత్రం బయటపడ్డ తర్వాతే శరణార్థుల […]

మనుషుల అక్రమ రవాణా.. ఆ ముగ్గురికి టర్కిష్ కోర్టు సంచలన తీర్పు..
Follow us on

టర్కిష్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మానవ అక్రమ రవాణా చేస్తూ.. ఎంతో మంది చావుకు కారణమైన ముగ్గురికి 125 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత.. టర్కిష్ కోర్టు తీర్పును వెలువరించింది. 2015 సెప్టెంబరు నెలలో సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన మూడున్నరేళ్ల చిన్నారి అలెన్ కుర్దీ మృతి.. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది. ఆ బాలుడి చిత్రం అప్పట్లో ప్రపంచం గుండెలను పిండేసింది. ఈ చిత్రం బయటపడ్డ తర్వాతే శరణార్థుల విషయంపై ప్రపంచ దేశాలన్నీ స్పందించాయి. అప్పట్లో శరణార్ధుల విషయంలో పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

బాలుడు కుర్దీ కుటుంబంతో పాటుగా మరికొంతమందిని టర్కీ నుంచి గ్రీకుకు తరలిస్తుండగా జరిగిన బోటు ప్రమాదంలో కుర్దీ కుటుంబం సహా మరికొందరు మృతి చెందారు. కేవలం ఎనిమిది మంది సామర్ధ్యం కలిగిన ప్లాస్టిక్ బోటులో.. ఏకంగా రెండింతల మందిని అందులో ఎక్కించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోలు స్టార్ట్ అయిన కాసేపటికే సముద్రంలో మునిగిపోయింది. కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన దోషులు.. వారి వద్ద నుంచి 6 వేల డాలర్లు వసూలు చేసినట్లు తేలింది.