సల్మాన్‌కి నెగిటివ్‌.. ఊపిరి పీల్చుకున్న బీటౌన్…అయినా 14 రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఫ్యామిలీ

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌తోపాటు అతని కుటుంబ సభ్యులకు నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. సల్మాన్‌ ఫ్యామిలీకి కరోనా పరీక్షలు జరిపించారు. ఇందులో సల్మాన్‌తో పాటు, అతని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ నెగిటివ్‌ నిర్థారణ అయింది.

  • Sanjay Kasula
  • Publish Date - 10:34 pm, Thu, 19 November 20

Salman Khan Test Negative : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌తోపాటు అతని కుటుంబ సభ్యులకు నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. సల్మాన్‌ ఫ్యామిలీకి కరోనా పరీక్షలు జరిపించారు. ఇందులో సల్మాన్‌తో పాటు, అతని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ నెగిటివ్‌ నిర్థారణ అయింది.

ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. ఫ్యామిలీ మాత్రం 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. ఇక సల్మాన్‌కి నెగిటివ్‌ అని తేలడంతో.. అతని ఫ్యాన్స్‌తోపాటు బీటౌన్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

సల్మాన్ వ్యక్తిగత డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకడంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ హోంక్వారంటైన్‌లోన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత డ్రైవర్, ఇద్దరు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన వెంటనే.. సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీతో కలిసి హోం క్వారంటైన్‌కి వెళుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే కరోనా బారిన పడిన తన సిబ్బందిని సల్మాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.