దీపికా స్టింగ్ ఆపరేషన్.. నిర్లక్ష్యంగా యాసిడ్‌ అమ్మకాలు!

యాసిడ్.. ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. వీటి దాడుల్లో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా ‘ఛపాక్’ అనే సినిమా తీసిన సంగతి విదితమే. ఈ మధ్య వారితో కలిసి ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌ని కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపికా యాసిడ్‌పై ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఆవీడియోని కాస్తా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ ఆపరేషన్‌లో కొన్ని […]

దీపికా స్టింగ్ ఆపరేషన్.. నిర్లక్ష్యంగా యాసిడ్‌ అమ్మకాలు!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 16, 2020 | 8:56 PM

యాసిడ్.. ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. వీటి దాడుల్లో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా ‘ఛపాక్’ అనే సినిమా తీసిన సంగతి విదితమే. ఈ మధ్య వారితో కలిసి ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌ని కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపికా యాసిడ్‌పై ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఆవీడియోని కాస్తా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ ఆపరేషన్‌లో కొన్ని నిజాలు వెలుగుచూశాయి.

దీపికా టైటిల్ రోల్‌లో పోషించిన చిత్రం ‘ఛపాక్’. ఇందులో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితమాధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ చిత్రంపై తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. కాగా.. ఈ నేపథ్యంలో యాసిడ్ కొనుగోలుపై దీపిక ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఛపాక్ చిత్ర యూనిట్‌.. వివిధ వేషాల్లో.. దుకాణాలకు వెళ్లి ఏకంగా 24 యాసిడ్ బాటిళ్లను కొనుగోలు చేశారు. దీన్నంతటినీ.. దీపికా కారులో కూర్చుని సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేయించింది. కోర్టు నిబంధనలు పెట్టినప్పటికీ.. ఒక్క రోజులో 24 యాసిట్ బాటిళ్లను కొనగలిగామంటే నమ్మలేకోతున్నానంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది దీపిక. కనీసం ఐడీ కూడా చూడకుండా ఎంతో ప్రమాదకరమైన యాసిడ్‌ని వ్యాపారులు అమ్ముతున్నారని పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికైనా యాసిడ్ అమ్మకాలు ఆపాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. కాగా.. కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా యాసిడ్ బ్యాన్‌పై ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో