Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

లోక్‌సభను నివ్వెర పరిచిన బిజెపి ఎంపీ..ఇంతకీ ఏమన్నారంటే?

bjp mp sensational comments, లోక్‌సభను నివ్వెర పరిచిన బిజెపి ఎంపీ..ఇంతకీ ఏమన్నారంటే?

దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, తదితర విపక్షాలు జిడిపి గణాంకాలను సభలో ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఈ సందర్భంలో బిజెపి ఎంపీ ఒకరు చేసిన కామెంట్లు సభలోని ఎంపీలతోపాటు పాలక పక్షాన్ని కూడా నివ్వెర పరిచాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి).. దేశ ఉత్పాదక శక్తిని దీని ఆధారంగానే అంఛనా వేస్తారు. ఉత్పాదక శక్తి, మార్కెట్ ధరలు, సరఫరా సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా దేశం ఆర్థికంగా బలంగా వుందా లేదా అన్నది తేల్చడం రివాజుగా మారింది. అయితే, గత ఏడేళ్ళ కనిష్ట స్థాయికి జిడిపి పడిపోవడం, ప్రస్తుతం జిడిపి 4.5 శాతంగా స్థిరపడడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగడుతున్నాయి.

ఈ విషయంలో సోమవారం లోక్‌సభను కుదిపేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే కూడా పాల్గొన్నారు. పాల్గొనడం వరకు బాగానే వున్నా.. జిడిపి అనేది 1934లోనే ప్రవేశపెట్టారని, అంతకు ముందు అది లేనే లేదని వింత వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ. జిడిపినే రామాయణం, మహాభారతం, బైబిలూ అన్నట్లు భావించడం సరికాదని, అది లేకుండా దేశ ఆర్థిక పరిస్థితి బాగానే వుంటుందని అర్థం పర్థం లేని కామెంట్లను బిజెపి ఎంపీ చేయడంతో సభికులంతా నిర్ఘాంతపోయారని సమాచారం.

ఆర్థిక పరిస్థితిని అంఛనా వేయడానికి ఒక కొలమానంగా గత ఏడు దశాబ్ధాలుగా అందరూ భావిస్తుంటే.. నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తెలిసి చేసినవా లేక తెలియక చేసినవా అని అధికార పార్టీ నేతలు తలలపట్టుకుంటున్నట్లు సమాచారం.