వీటిని తినిపిస్తే మీ చిన్నారుల మెదడు పాదరసంలా పనిచేస్తుంది..

May 10, 2024

TV9 Telugu

TV9 Telugu

పిల్లల శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పక ఇవ్వాలి. ఫలితంగా వీరి మెదడు పాదరసంలా పనిచేసి చదువులో రానిస్తారు

TV9 Telugu

మెదడు ఆరోగ్యం, మానసిక స్థితి నియంత్రణకు తోడ్పడే పోషకారాలలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ ముఖ్యమైనవి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి

TV9 Telugu

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు, మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ B6 సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్

TV9 Telugu

సాల్మన్, మాకేరెల్‌, సార్డినెస్‌ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, మూడ్ నియంత్రణకు దోహదపడతాయి

TV9 Telugu

బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలలో ఒమేగా-3లు, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ మెదడు పనితీరు, మానసిక స్థితి స్థిరత్వానికి తోడ్పడతాయి

TV9 Telugu

గుడ్లు ప్రోటీన్ మంచి మూలం. ఇందులో విటమిన్ D, విటమిన్ B12, కోలిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితి నియంత్రణకు దోహదపడతాయి

TV9 Telugu

అవోకాడోలో విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియంతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు పనితీరుకు, మానసిక స్థితి మెరుగుదలకు సహాయపడతాయి

TV9 Telugu

పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇది ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గట్ ఆరోగ్యం మూడ్ రెగ్యులేషన్‌తో ముడిపడి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి